Shalem’s Kavithalu
షాలేమ్ & కో కవితలు
|
పాత గురుతులు
పాత గురుతుల పీక నొక్కెయ్ తీపి కలలను పాతి పెట్టేయ్ ఊహలన్నీ ఉట్టి పైకి మాటలన్నీ మట్టిలోకి గట్టిగా మరి నెట్టివెయ్ వట్టివేనని కొట్టివెయ్ పట్ట పగలే చీకటై నిను వెక్కిరించిన వేళలో నిండు వెన్నెల గండమై నీ గుండె చీల్చిన బాధలో సృష్టి కర్తను తలచుకో దృష్టి తనపై నిలుపుకో వెనుక వాటిని మరచిపో ముందు ముందుకు నడచిపో -భక్తిపరురాలైన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని ఆశించి ఆశ భంగమైన తరువాత మూడు నెలలు ఏడ్చి చివరకు ప్రభువు ద్వారా పొందిన ఆదరణ ద్వారా వ్రాసిన కవిత (1988) |
చింతపండు చారు
చారు మెచ్చని నోరు ఊరు తిరగని కారు కారణములేని పోరు వ్యర్ధమ్మురా బాబు వ్యర్ధమయ్యా…. చారు చేసెడి వరము కాదు అందరి తరము అది యెంతో రుచికరము నమ్మండిరా బాబు నమ్ముడయ్యా… చారు విలువనెరుగు వారలే బహు అరుదు వారి బ్రతుకులగును ధన్యమ్మురా బాబు ధన్యమయ్యా… కన్నాపురంలో పరిచర్య చేసే కాలంలో మాంసాలే తప్ప చారు పెట్టని సహోదరీలకు – నాకు చారు ఇష్టమని చెప్పే ప్రయత్నంలో వ్రాసిన కవిత (1989)
ఆహా! ఏమి కవిత బ్రదరు!! గుర్తుకొచ్చింది మా మదరు
వేడెక్కింది ఒంటిలోని వెదరు
గుర్తుకొస్తే ఆ రోజులు అదురు (మా అమ్మ చారు బ్రహ్మాండంగా చేసేది) రెస్పాంస్ కవిత by రెవ.పక్కి సురేష్ కుమార్ (విశాఖపట్నం) |
|
చపాతీ
ఉండాలోయ్ ఉండాలి చెక్క పెట్టికి అరలు చిన్న కారుకి తెరలు చపాతీకి పొరలు ఉండాలోయ్ ఉండాలి నా భార్యకు చపాతీ ఎలా చేయాలో నేర్పించే సందర్భంలో వ్రాసిన కవిత (2006) |
చుక్కలు
ఎన్నని నేనెన్నగలను కన్న తండ్రి కానుకలను లెక్క చూడ తనదు మేళ్ళు చుక్కలైన తక్కువింక దేవుడు చేస్తున్న ప్రతి మేలుకు ఒక కవిత చొప్పున వ్రాసి, వ్రాసి, చివరకు ఇక వ్రాయలేక ముగింపు కవితగా వ్రాసుకున్న నాలుగు మాటలివి. (1986) |
|
నా పెళ్ళి కాక ముందు
ఒరేయ్! పెళ్ళయినోడా.. నీ బ్రతుకిక పగిలిన ఓడ అది ఒక విరిగిన గోడ నిలువునా కూలిన మేడ నీకూ ఆ గాడిదకూ లేదిక ఏ తేడా ఇక చూస్కో నీ ముందంతా పేడ పేడ! ఆ సమయంలో పెళ్ళి ఆయినోళ్ళ కష్టాలు చూసి ఒక విరక్తి భావంతో అలా వ్రాసాను.
|
నా పెళ్ళి అయిన తరువాత
ఓహో! పెళ్ళి చేసుకున్న సహోదరుడా నీ జీవితం మేలుతో నింపబడిన ఓడ వివాహం నీకు భద్రతనిచ్చే ప్రహరీ గోడ ఎండా వానల్లో ఆశ్రయమిచ్చే పెద్ద మేడ అప్పటికి ఇప్పటికి మధ్య ఉంది చాలా తేడా నిజం నిజం నీ భార్య నీకొక దూద్ పేడా! 128 వ కీర్తన ప్రకారం నా లోగిట నా భార్య ద్రాక్షావల్లిగా కనబడినపుడు పెళ్ళి మీద నా అభిప్రాయం మార్చుకొని వ్రాసిన కవిత యిది. (జులై 11, 1992 – మా పెళ్ళి రోజు) |
| ఒరేయ్ పెళ్ళి కానోడానీ జీవితం గ్యాసు లేని సోడాఊడి పడిన గుర్రపు నాడా
త్వరగా పెళ్ళి చేసుకోరా నా చెలికాడా ! రెస్పాంస్ కవిత by రెవ.పక్కి సురేష్ కుమార్ (విశాఖపట్నం)
|
అనాది నిత్యత్వం – అనంత నిత్యత్వం ఈ రెండింటి మధ్యలో ఈ రోజు పుట్టింది కాలాన్ని సృష్టించి కాలాన్ని నడిపించే కరుణ మూర్తి యేసు శరణుజొచ్చాను నా కాపరి యేసైతే నాకేం తక్కువంటూ నదురు బెదురు లేకుండా నడక సాగించాను నా రాజు ముందు ఈ రోజు మోకరించింది నా హృదయంలో శాంతి వెల్లి విరిసింది. మునిసిపల్ ఆఫీస్లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కోసం పడిగాపు్లు కా్స్తూ ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకిచ్చిన మాటలివి. – షాలేమ్ అరసవెల్లి 31-05-2011 |
| కార్బన్ రేణువుపెద్ద పొగ పర్వతం లోఎగురుతూ ఉన్న కార్బన్ రేణువును నేను.అత్యంత జ్ఞానవంతంగా నన్ను నిర్మించిన నా సృష్టి కర్తకు తప్ప
నేనెవరినో ఎవరికీ తెలియదు. చిన్నరేణువునని నన్ను మరచిపోడు నా పరమ తండ్రి. ఆ తండ్రి నన్ను గుర్తుంచుకోవడమే కాదు, గుర్తిస్తాడు కూడా. కాబట్టి నరుల గుర్తింపు నాకెందుకు? అయినా వారు నన్నుగుర్తించడానికి నేనేపాటివాణ్ణి? అసలు వారు కూడా నాలాంటి చిన్న కార్బన్ రేణువులే కదా! దేవునికే మహిమ కలుగును గాక!! (27-9-2011 తేదీన నర్సాపురఁలో టిల్స్ లే మిస్సమ్మ గారి జ్ఞాపకార్ధ కూడికలో పెద్దలందరితో పాటు స్టేజ్ మీద కూర్చున్నపుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన తలంపు ఇది – షాలేమ్ అరసవెల్లి)
|
అద్భుత ప్రపంచంలో
అబద్దాల అరాచకత్వం అడ్డూ ఆపూ లేకుండా అలజడి చేస్తోంది. కొంతకాలం గడిచాక కొత్త లోకమొకటి కొదువ లేసి సత్యంతో కొమ్మలు వేస్తుంది. అంత వరకూ తప్పదు అపవాది అరాచకత్వం. అంతంలో ఉంది వాడికి అసలైన నరక శిక్ష. రాబోయే రాజ్యంలో రారాజు యేసయ్య రాత్రి లేని రోజులను రాజీవం చేస్తాడు. |